కరోనా సేవకులు - పిల్లి హజరత్తయ్య

కరోనా సేవకులు - పిల్లి హజరత్తయ్య


సేవకుల్లారా వందనం..!

కరోనా మాయరోగం
కాకలు తీరిన యోధులకు సైతం
కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే
కాపాడడానికి ముందుకు వచ్చిన
కరోనా సేవకుల్లారా.! వందనం..!

అంటుకుంటే విడవని వైరస్ అని తెలిసి
ఆసుపత్రిలో వైద్యం చేసి
అహర్నిశలు శ్రమించి
అకుంఠిత దీక్ష వహించి
జనులను కాపాడిన వైద్యల్లారా! వందనం..!

కాటికి వెళ్లాల్సి వస్తుందని తెలిసినా
కార్యసాధకులై అలుపెరుగక శ్రమించి
కుటుంబాలను విడిచి
కంటికి రెప్పలా ప్రజలను రక్షించిన
రక్షకభటల్లారా! వందనం..!

మురుగును,వ్యర్థాలను తొలగించి
కరోనాపై సమర శంఖం పూరించి
వీధి వీధులు శుభ్రం గావించి
ప్రజల ప్రాణాలను నిలిపిన
పారిశుద్ధ్య కార్మికుల్లారా! వందనం..!

బంధాలను, అనుబంధాలను విడిచి
రేయనక,పగలనక శ్రమించి
రోగ నివారణకు సమయాన్నివెచ్చించి 
ప్రజలకు జీవితాలను ప్రసాదించిన
భరతమాత ముద్దుబిడ్డల్లారా! వందనం..!

పిల్లి. హజరత్తయ్య, 
శింగరాయకొండ, ప్రకాశం

0/Post a Comment/Comments