సృష్టి
అందమైన ప్రకృతి భగవంతుని అద్భుతమైన సృష్టి
హిమాలయాలు హిమానినదాలు
గంగసింధుకావేరికృష్ణాగోదావరినదీజలాలు
సముద్రాలు మహాసముద్రాలు సృష్టిలో భాగాలే
నిండైన చందమామ పండువెన్నెల
ఉదయభానుడు పగటి వెలుగు
అందమైనఆకాశంహరివిల్లునక్షత్రాలు నల్లనిమబ్బులు
తొలకరిజల్లులు జోరువాన ఉరుములు మెరుపులు
సమస్త జీవరాసుల ఉనికి భూగోళం
అందులో కడుపునింపే పచ్చని పంట పొలాలు
కార్మికులు కర్షకులు పెత్తందార్లు పెట్టుబడిదార్లు
కలిమిలేములు కష్టసుఖాలు
ప్రకృతి ఇచ్చిన అనేకమైన సహజ వనరులు
నీటివనరులుసాగరవనరులు పచ్చని వనరులు
అన్నింటా ముఖ్యమైన మానవ వనరులు
ప్రకృతి యే విలువ కట్టలేని విలువైన అమూల్య వనరు
జంతువులు (మానంకూడా) పరపోషకాలుగా
మొక్కలు స్వయంపోషకాలు గా
4కాలాలు 6ఋతువులును రేయిపగలను
కలిగిన అద్భుతమైన విశ్వమే ఒక సృష్టి
సృష్టికి మూలం సర్వేశ్వరుడు
ఇంత అద్భుత సృష్టికి నాయకుడు మానవుడు
సృష్టి కి ప్రతిసృష్టి గలవాడు నేటి మానవుడు
కాకూడదు సృష్టికి అపకీర్తి తెచ్చే దానవుడు
అన్నం పెట్టిన చేయినే తూలనాడుచున్నాడు
కూర్చున్న కొమ్మనుతెగ నరుకుతున్నాడు
మానవత్వాన్ని మంటగలుపు తున్నాడు
విశ్వం పై విశ్వాసాన్ని విడిచిపెట్టి
విషం కక్కుతున్నాడు
ఇకనైనా మనిషి విశ్వశాంతి కి కృషి చేసి సృష్టిని కాపాడాలి
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
టీచర్ సాలూరు
విజయనగరం జిల్లా
9441530829