నా దారి..!(కవిత)
నా పనిని నేను ఇష్టంగా
చేస్తున్నప్పుడు
"విజయం"
నా దరి చేరకుండా పోతుందా..!?
నా బాధ్యతను
సక్రమంగా నిర్వర్తించినప్పుడు
నా హక్కులు నాకు దక్కకుండా పోతాయా..!?
నా జీవితంలో ప్రేమాభిమానాలు పెరిగి, నాలో దుర్గుణాలు తొలగినప్పుడు,
నాలోని మంచి గుణాలు నావి కాకుండా పోతాయా..!?
నా జీవితాన్ని నేను సక్రమమైన
దారిలో నడిపిస్తున్నప్పుడు ,
మంచి సౌలభ్యాలు,సౌకర్యాలు,
సంతోషాలు
నాకు అందకుండా పోతాయా..!?
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.