బడి పంతులు పంథా ---- శ్రీపాల్ , గ్రా:గోవింద్ పేట్ మం:ఆర్మూర్, నిజామాబాద్.

బడి పంతులు పంథా ---- శ్రీపాల్ , గ్రా:గోవింద్ పేట్ మం:ఆర్మూర్, నిజామాబాద్.

బడి పంతులు పంథా

బడి పంతులు 
పంథా మారుతుంది
బడి గంటలతో మొదలయ్యే 
అతని జీవితం
ఆన్లైన్ పాఠాల గంటలో చిక్కుకుంది
జీతం తక్కువైనా
చెదరని చిరునవ్వుతో
జీవితం గడిపే
బడిపంతులు పంథా మారుతుంది
అక్షరాలు నేర్పే చేతులు 
అంతు చిక్కని వ్యాధిగ్రస్తుడిగా
పని లేక
బ్రతకలేక
బాధను మింగలేక 
బడి పంతులు
బ్రతుకు బండి నడుస్తుంది
ఎవరు వెతకాలి
అతని వ్యథను
ఎవరు గుర్తిస్తారు
అతని వేదనను
దేశానికి జ్ఞానాన్ని పంచే వారిని గురువు అంటారు
ఆ గురువే గుర్తింపులేని పరిస్థితి లోకి వెళితే
దేశం యొక్క స్థితి
దేశం యొక్క దుస్థితి
ఎలా వుంటుందో ఊహించండి
గురువును గుర్తించండి
అతని జీవితాన్ని బ్రతికించండి....

•••••••శ్రీపాల్••••••


0/Post a Comment/Comments