అక్షరమే ఆయుధం
కత్తి కన్నా కలం గొప్పది
మాట కన్నా చేత గొప్పది
మనిషి కన్నా మానవత్వం గొప్పది
ఆయుధం కన్నా అక్షరం గొప్పది
విజ్ఞాన అంబులపొదలో
అక్షరమాలికల శరం తో
అజ్ఞాననికి విల్లు ఎక్కుపెడితే
అజ్ఞానం పటాపంచలవుతుంది
అక్షరాల పూదోటలో
పెరుగుతున్న అజ్ఞానపు
కలుపు మొక్కలను అక్షరాయుధాలతో పిచికారీ
చేయిస్తే సుగంధాల పూదోట
మన వశం అవుతుంది
అక్షరసేద్యం చేసినట్లయితే
సారవంతమైన జ్ఞానపు పంట
అధిక దిగుబడి రూపంలో
తల్లిదండ్రుల కలల పంటగా
విజ్ఞానమై చేతికి ఆందోస్తే
ఆ ఆనంద దిగుబడి చెప్పలేనిది
అక్షరమాలలు
అక్షరమాలికలు
అక్షర ఆయుధాలు
అజ్ఞానానికి ఎప్పుడూ శత్రువులే
అక్షరం అజ్ఞానానికి తొలి శత్రువు
అక్షరం విజ్ఞానానికి తొలి మిత్రువు
అక్షర కుసుమాలు సుగంధ సుమాలు
విజ్ఞానానికి సుమాల వనాలు
--- పసుమర్తి నాగేశ్వరరావు,
టీచర్, సాలూరు.