'సైనికుల నుదుటిన వీర తిలకం!'
(వచన కవిత)
మన హైందవ పుడమికి
ఆ వైపున విషం ఎగజిమ్మే రక్కసి మూకలు..
నిరంతరం కుట్రలు, కుతంత్రాలు, కుహూనా పన్నాగాలు..
ఏ క్షణం ఏ వైపు నుంచి నిప్పులు
వెదజల్లుతారోనని..
సరిహద్దుల్లో మఙ సైనిక సోదరులు ఎంత అప్రమత్తంగా ఉన్నా..
జత్తుల మారి వేషాలతో
రకరకాల దాడులు సలుపుతూనే ఉంటారు..
కవ్వింపులు, వెక్కిరింతలు వారికి సర్వ సాధారణ విన్యాసాలు,
ఉద్రేకాన్ని పెదవంచున నొక్కిపెట్టి మనవాళ్ళు సంయమనాన్ని ఎంత కొనియాడినా..
సూర్యుడి ముందు ఎత్తిన దివిటీనే!
అప్పటి మన ప్రధాని వాజ్ పేయ్ సంఝౌతా
ఎక్స్ ప్రెస్ లో
స్నేహాస్తం సాచితే
పాక్ ప్రేరేపిత ఊకుమ్మడిగా
మనదేశంలో జొరబడ్డారు ఉగ్రవాదులు..
మన అవనిని అల్లకల్లోలం చేశారు ముష్కరులు..
భారతావనికి కొన భాగమైన కార్గిల్ లో దురాక్రమించి దొంగలుగా మారి..
సైనికులను ఊచకోత కోశారు..వారి కుటుంబాలకు
హృదయాలను కోత పెట్టారు..
దాయాదులని ఉపేక్షిస్తుంటే కపట నాటకాలాడుతున్నారు..
యావత్ ప్రపంచానికి వాళ్ళ నిజస్వరూపాన్ని చూపించారు..
మన శాంతితత్త్వం చూశారు..
ఇహ, కాషాయ దేశభక్తిని చూస్తారు..
సరిహద్దులకు మానవ కంచెలా ఉండి..
దేశరక్షణలో ఆత్మ సంతృప్తినొందిన సైనికులారా..
మీ ఫాలభాగాన వీర తిలకమై ప్రజ్వరిల్లుతాం!
శతృసైనికులను భస్మీపటలం చేస్తాం!!
---సుజాత.పి.వి.ఎల్.,
సైనిక్ పురి, సికిందరాబాద్.