కష్ట కాలం..కావాలి సహనం..! --- ముహమ్మద్ ముస్తఖీమ్" విన్నర్"

కష్ట కాలం..కావాలి సహనం..! --- ముహమ్మద్ ముస్తఖీమ్" విన్నర్"

కష్ట కాలం..కావాలి సహనం..!

కష్ట కాలం నడుస్తున్నప్పుడు..
ధైర్యమే రక్ష..!
కాస్త సహనం వహిస్తే చాలు 
మంచి రోజులు.. 
వచ్చి తీరతాయి..!
కష్టాల కడలిని దాటడంలో ఎప్పుడూభయపడకూడదు!
"జీవితనౌక" ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి..!
అంతే కాని,మునుగుతుందని..
సందేహించకూడదు,
భయపడకూడదు..!
 "దేవుడు" అనే వాడు ఒకడున్నాడనే విషయ వాస్తవాన్ని మర్చి పోకూడదు..!??
అంతా అతని పై వదలి,
ధైర్య స్థైర్యాలతో ఉండాలి..!
దుప్పికాలు ను పట్టుకున్న మొసలి.. 
తీవ్ర ప్రయత్నం..
చివరకు ఆ పోరాటంలో
విజయం సాధించిన దుప్పిలా ఉండాలి,మనలో ప్రయత్నం..!
కష్టాలు,బాధలు..విడవనంతగా ఉంటే..
విడిపించి తీరాలి..!
అలాంటి సంకల్పం చేసుకోవాలి..!?
కష్టానికి వెరవని తత్వం మనదై ఉండాలి..!
జీవితం ఒక నిత్య పోరాటం..అందుకే,
కష్టాల,ఇబ్బందుల కొలిమిలో నిత్యం రగలడం మామూలు అయిపోవాలి..!

రచన:-✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్, 
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments