వారధి(ఇష్టపది మాలిక)-డా. అడిగొప్పుల సదయ్య

వారధి(ఇష్టపది మాలిక)-డా. అడిగొప్పుల సదయ్య

తండ్రికిని పిల్లలకు తల్లియే వారధీ
ఛాత్రునకు సంఘముకు సద్గురువు వారధీ

అహమునకు బుద్ధికిని ఆత్మయే వారధీ
మాటకును చేతకును మనసుయే వారధీ

జీవునికి దేవునికి యోగమే వారధీ
శత్రునకు మిత్రునకు సంధియే వారధీ

పువ్వుకును నవ్వుకును గంధమే వారధీ
అందముకు ఛందముకు బంధమే వారధీ

దేహముకు దేహికిని అహమేగ వారధీ
శేషునకు శేషికిని శేషమే వారధీ

దాహముకు మోహముకు ధనమేగ వారధీ
శోధనకు సాధనకు వేదమే వారధీ

ప్రకృతికి పురుషునకు పరమరతి వారధీ
నాకముకు నరకముకు చింతయే వారధీ

రాజునకు పేదలకు సేవయే వారధీ
రామునకు లంకకును హనుమయే వారధీ

లోకముకు శోకముకు కోర్కెయే వారధీ
నాకున్ను నీకున్ను ప్రేమయే వారధీ


కవిచక్రవర్తి
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
కరీంనగర్
9963991125

0/Post a Comment/Comments