జీవితపరమార్థం --- వి. కృష్ణవేణి, వాడపాలెం.

జీవితపరమార్థం --- వి. కృష్ణవేణి, వాడపాలెం.


జీవితపరమార్థం

సృష్టిలో అన్నింటికంటే విలువైనది
నిస్వార్థంగా బ్రతకడం 
సాంఘీక సామాజిక అవసరాలను 
అందరికి అందించడానికి ఎంతోమంది 
చేసినసేవలు నిస్వార్దానికి  ఆనవాళ్లు
ఎంతోమంది దేశంకోసం ప్రాణత్యాగాలు చేసినవారు 
ఏ స్వార్థం లేకుండా పాటుపడి
జీవనసార్దకతను పొందారని
వారి నిస్వార్థ త్యాగఫలమే దేశాభివృద్ధి.
ఒకరికొకరు సహాయం అందిపుచ్చుకుంటూ
ఒకరు కష్టాలలో ఒకరు తోడుంటూ
ప్రపంచంలో అందరితో సమానత్వాన్ని ప్రదర్శిస్తూ 
ఒకరికొకరు సమాన భావనతో 
బంధాలను బంధుత్వాలను కలుపుకుంటూ
సమాజమే తన కుటుంబమని
తోటి వారికీ చేయందిస్తూ,
చేయూతనిస్తూ
నీనున్నాననే భరోసా ఇస్తూ 
తోటి వారికష్టాన్ని అర్ధం చేసుకుని
తనవంతు సహాయాన్ని అందిస్తూ
నిస్వార్థ సేవను అందిస్తూ
కష్టాలలో ఉన్నవారికి చేయూతనిస్తూ
అందరి ఆధారాభిమానాలను
ప్రేమానురాగాలను,
అందరి మన్ననలను పొందగలిగితే 
అదే జీవిత పరమార్థం.
 నిస్వార్థమైన   సహాయానికి మించి ఏది లేదు
అదే జీవన సార్ధకత అని చెప్పవచ్చు..

--- వి. కృష్ణవేణి,
వాడపాలెం.
 

0/Post a Comment/Comments