సహాయం చేస్తే తిరిగి వస్తుంది. --- డా.. కందేపి రాణీప్రసాద్.

సహాయం చేస్తే తిరిగి వస్తుంది. --- డా.. కందేపి రాణీప్రసాద్.



సహాయం చేస్తే తిరిగి వస్తుంది.
                                 డా.. కందేపి రాణీప్రసాద్.

పూర్వం ఒక వ్యాపారి దగ్గర ఒక గుర్రం ఉండేది.అతని వ్యాపారానికి కావలసిన 
సరుకులు పొరుగూరికి వెళ్లి తెచ్చుకునేవాడు.గుర్రం వీపు మీద తక్కువ బరువులు వేసేవాడు.అదే గాడిద వీపు మీద మాత్రం చాలా ఎక్కువ బరువులు వేసేవాడు.పాపం గాడిద మారు మాట్లాడకుండా ఎంత బరువైనా మోసేది బాగా అలసిపోయేది. గుర్రం వీపు మీద తక్కువ బరువు ఉండటం మూలంగా చకచకా నడుచుకుంటూ వెళ్ళేది మరియు చాలా ఉత్సాహంగా ఉండేది.
          ఒక రోజు గాడిదకు జ్వరం వచ్చింది నీరసంగా ఉన్నది కళ్లు తిరుగుతున్నాయి.అప్పుడు గుర్రాన్ని ఇలా అడిగింది - " ప్రీయనేస్తమా, ఈ రోజు నా ఆరోగ్యం బాగాలేదు.దయచేసి ఈ రోజు నా బరువులు నీవు మోసుకోస్థావా ".
           'గాడిదకు సహాయం చేస్తే నాకేమోస్తుంది.నాకైతే యజమాని తక్కువ బరువులే ఇస్తున్నాడు.నేను హాయిగా ఉన్నాను గాడిద సంగతి నాకెందుకు' అని మనసులో ఆలోచించుకుంది గుర్రం.సారీ,గాడిదా! యజమాని నీకిచ్చిన బరువును నువ్వే మోయాలి.నేను సహాయం చెయ్యలేను' అన్నది గుర్రం నిర్మొహమాటంగా.
                గాడిద నిస్సహాయంగా నడుస్తూనే ఉన్నది.దానికి ఆయాసం వచ్చింది.
అయినా గుర్రం పట్టించుకోలేదు.అలాగే ఇంకో రెండు మైళ్ళ దూరం నడిచింది.
అకస్మాత్తుగా గాడిద కింద పడిపోయి ప్రాణాలు విడిచింది.
                అప్పుడు వ్యాపారి గాడిద మీదున్న బరువులన్నీ తీసి గుర్రం మీద వేశాడు.గుర్రం గుండె గుభెలు మంది.అంతే కాక చచ్చిపోయిన గాడిద శరీరాన్ని కూడా గుర్రం వీపుకే కట్టాడు.గుర్రం నడుం విరిగి పొయినట్లుగా అనిపించింది.
గుర్రం బరువులు మొయలెక ఏడ్చింది.ఇందాక గాడిదకు సహాయం చేసి ఉంటే బావుండే దనుకున్నది.ఇక ప్రతిరోజూ గాడిద పని కూడా తనే చేయాలి.ఎంత తప్పు చేశాను అని బాధ పడింది.నా స్వార్థం నాకు నష్టం కలుగజేసింది అని గుర్రం వగచింది.

నీతి:- ఎవరికైనా సహాయం అవసరమైనపుడు స్వార్థాన్ని వీడి సహాయం చేయండి. పరులకు చేసిన సాయం మీకూ ఉపయోగపడుతుంది.

0/Post a Comment/Comments