పుస్తకాలు.. నా స్నేహితులు..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

పుస్తకాలు.. నా స్నేహితులు..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

పుస్తకాలు..నా స్నేహితులు..!(కవిత)
*********✍🏻విన్నర్******
జీవితాల్ని మార్చడంలో ,
పుస్తకాలు కూడ ముందుంటాయి..!
మనిషికి ప్రేరణ నిచ్చి, లక్ష్యం 
 వైపు దూసుకు వెళ్లే,బాణం
 లా ప్రేరేపిస్తాయి..!
జీవితం పట్ల అవగాహన నిస్తూ,ధైర్య సాహసాలను ప్రదర్శించేలా చేస్తాయి..!
ఒక మంచి జీవన విధానానికి 
తెర లేపుతూ ఎంతో మేలు చేస్తాయి..!
ఒక మంచి స్నేహితునిగా..
సలహా లిస్తాయి..!
ఒక మేలు కోరే శ్రేయోభిలాషి గా నిస్వార్థంగా మసలుకుంటాయి..!
ఒక తల్లిగా..
ఒక తండ్రిగా..
మారకుండా..నిజంగా వాస్తవితకను,నిజమైన ప్రేమను కలిగి ఉంటాయి..!
దుమ్మూ ధూళి..పడ్డా..
విషయాల్ని మార్చవు..!
మనుషుల లాగా ముసలివై పోతాయి..తప్పితే,
ఎలాంటి దోఖా ఉండదు..!
అందుకే..అన్నారు,
వీరేశం పంతులు గారు..
"చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కాని,ఒక మంచి పుస్తకం కొనుక్కో..నని,"👍🙏
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ

0/Post a Comment/Comments