చల్లని వెన్నెల..!
చల చల్లని చంద్రుని వెన్నెల..!
జగత్తును మెరిపిస్తూ, మురిపిస్తున్న వేళ..!
ఆ తారలన్ని ఏకమై,మమేకమై,
మిణుక్కుమంటూ... ,
చందమామ తో
జతకట్టగా..!
తీయనైన పాటలు పాడగా,
ఆ నింగినంతా
ప్రతిధ్వనించగా..!
ఆకాశం..ఆనందించగా..!
చల్ల గాలుల సందడిలో..
మధురానుభూతులు మదిలో తిష్ఠ వేయగా..!
నులక మంచం పై
నిదురిస్తూ..ఆహ్లాదంగా నీలాకాశం ను చూస్తూ..
హాయిగా ఇలా రాత్రిని గడిపేశా..!
రచన :-✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.