చూశారా ఆ ప్రతిమలు ---డా విడి రాజగోపాల్

చూశారా ఆ ప్రతిమలు ---డా విడి రాజగోపాల్

చూశారా ఆ ప్రతిమలు
మన పుట్టుకకు కారణమైన 
ఆడమ్ మరియు  ఈవ్ లాగా లేరు, 
ప్రకృతి ముద్దు బిడ్డలు వారు,
కొండ గుహలు వారికి ఆశ్రమం,
తన ముద్దు బిడ్డల కోసం 
ఏకంగా ఓ క్షీరసాగరాన్నే  సృష్టించింది

వారికి......... 
నడక నేర్పమని రాజ హంసలను, 
సంగీతం వినిపించమని కొయిలమ్మను,
ఆకలి తీర్చమని అరటిని,
అవిచాలవని రక రకాల పళ్ళిచ్చే 
వృక్షాలను,
జడలో ముడచుకోను 
రంగు రంగుల పూలను,
తనివితీరా స్నానం చేయించను
గంగమ్మను,
నడచి నడచి అలసి పోతారని ఐరావతాన్ని,
అప్పడప్పుడు ఆకాశ విహారం చేయించ గరుత్మంతుని,
పురివిప్పి నాట్యం చేసి ఆహ్లాదించ
అందమైన నెమళ్ళను,
ఇలా ఎన్నో సృష్టించి మురిసింది ప్రకృతి,

ఇవేకాక........
భగ భగ మండే సూర్య తాపానికి 
ఎక్కడ మాడిపోతారోనని
మేఘాలనే సృష్టించి
అప్పడప్పుడు గొడుగు పట్టమంది

అందమైన జలపాతాలు
హిమగిరి సొగసులు 
సూరీడు కనుమరుగయ్యాక 
చల్లనయ్య చందమామను,
మెడలో అలరించుకోను వజ్ర వైఢూర్యాలను

ఇన్నిచ్చి పెంచిన ముద్దు బిడ్డలు వారు
అందుకే మన  కళ్ళముందు కనపడేలా ఇద్దరినీ  శిలారూపాన 
ఉంచినట్లుగా లేదూ! ప్రకృతి

ఓ సారి ప్రణామాలు పలుకుదాం వారికి 

---డా విడి రాజగోపాల్
9505690690

0/Post a Comment/Comments