అర్ధాంగి అలక
అతని ప్రేమ వర్షంతో నా మనసు తడిచింది
తడిచిన మనసును వెన్నెల రహదారుల్లో ఆర వేశాను
ఆ దారుల వెంట తన నయనాల కాంతికిరణాలు నింపుతూ,
సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టాడు
విశాలమైన మైదానంలో ప్రేమ,
ప్రేమ గవ్వలు ఏరుకుంటూ,
ఓరకంట నా అలకలు చూస్తున్నాడు
తన మౌనాన్ని నేను భరించలేను అని తెలిసి,
తన నవ్వులతో గాయం మాని పోవాలని,
కొంటె చూపుల గాలం విసురుతున్నాడు
అమ్మో ఆలీ అలక విలువ లేదా లేక తాళి కట్టాడు అని,
అతనిపై నేను అలగకూడద
భామని బ్రతిమిలాడడం అంటే ఎందుకు అంత టెక్కు ...
కానీ నువ్వు బతిమిలాడితే ఆనంద పడడం హక్కు
అమ్మో ఒక నవ్వు నవ్వి నన్ను మాయలో పడ వేస్తాడు
మాయదారి మొగుడు వలలో ,
ఎప్పటికప్పుడు చిక్కి పోతూనే ఉంటా నేను
మీ
ఇడుకుల్ల గాయత్రి