అంశం: నాలుక
జిహ్వకో రుచి
దానిని ఆపలేవు ఏవి
అందరికీ ఉంటాయి ఇవి
కనిపించవు తరుచు ఎవరికివి!
నరం లేని నాలుక
మూడు ఇంచుల నాలుక
పెట్టును జనులకు మెలక
గూటిలోనే దాగుకుని యుండు
గుండెలను పిండి చేయుచుండు!
మాటలాడునది నాలుక
ఎక్కిరించునది నాలుక
సైగలు చేయునది నాలుక
రుచులను తెలుపేది నాలుక
రోగాలను పెంచునది నాలుక!
నాలుకనుచూసి నాభిరోగం పసిగట్ట వచ్చు
నాలుక పిడుచ గట్టిన తెలుయుకరోనతీవ్రత
నాలుక తెల్లబడిన తెలుయు రక్తహీనత
నాలుక చేదును బట్టి తెలియు జ్వరం కథ!
మధుర పలుకులు పలుకునది నాలుకే
కఠిన పాషాణముతో మాట్లాడునది నాలుకే
బంధు మిత్రులను కలిపేది నాలుకే
దుష్టులను, శత్రువులను పెంచేది నాలుకే!
'నోఱు మంచిదైతే ఊరుమంచిద'నిరి
'పెదవి దాటుతే పెన్నదాటినట్ల'నిరి
నాలుకను అదుపులో పెడితేఆనందముండు
నాలుకను నియంత్రించినా రోగాలు ఉండవు
మూడుఇంచులనాలుకకు ముకుతాడువేసిన
సమాజం , దేశం, ప్రపంచం సుభిక్షముండు!
--మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్