- మార్గం కృష్ణ మూర్తి
అంశం: పవిత్ర స్నేహం
స్నేహమంటే ఒక ధైర్యం
స్నేహమంటే ఒక అవసరం
స్నేహమంటే ఒక భాద్యత
స్నేహమంటే ఒక భద్రత!
స్నేహమంటే ఇద్దరి మనసుల కలయిక
స్నేహమంటే ఇద్దరి అభిప్రాయాల కలయిక
స్నేహమంటే ఇద్దరి ఆలోచనల కలయిక
స్నేహమంటే ఒక గౌరవం, ఒక నమ్మకం!
కవిత వేరు, కథ వేరు
సినిమా వేరు, జీవితం వేరు
ఒప్పందం వేరు, స్నేహం వేరు
ద్వాపర యుగం, వేరు కలియుగం వేరు
ద్వాపరయుగంలోకుచేలుడు కృష్ణుడి స్నేహంవేరు
కలియుగంలో ఇద్దరి మనుష్యులస్నేహం వేరు!
స్నేహం అమృతం , విషం
అతి స్నేహం అనర్ధ దాయకం
గుడ్డి స్నేహం ప్రమాదకరం
అతి విశ్వాసంతో జీవిస్తే మిగిలేది శూన్యం!
స్నేహాలనునాలుగురకాలుగా విభజించవచ్చు
బాల్య దశ స్నేహాలు , యవ్వనదశ స్నేహాలు
కుటుంబదశ స్నేహాలు , వృద్ధాప్యదశ స్నేహాలు
ఒక్కో దశలో మరెన్నో రకాల స్నేహాలు!
ఒక వ్యక్తి యొక్క మాటల చేతలనుబట్టి
ఆ వ్యక్తి యొక్క గుణ గణాలను చెప్పవచ్చు
ఒక వ్యక్తి యొక్క స్నేహితులను బట్టి
ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చెప్పవచ్చు!
స్నేహమని చెప్పి కుటుంభాల
కూల్చిన వారు లక్షలు
హత్యలు చేసిన వారు కోకొల్లలు
మోసాలు చేసిన వారు కోట్లు
స్నేహం ఎంత వరకు ఉండాలో
అంత వరకుంటేనే సవ్యం!
స్నేహం కనబడని కత్తి లాంటిది
అవసరాల వరకే ఉపయోగించుకోవాలి
ఆ తరువాత దాచి పెట్టు కోవాలి
ఇద్దరి పరిపక్వ మనసుల కలియికలు
స్నేహంగా భావించాలి!
ఆపదలో ఆదుకునేది స్నేహం కాదు
అది కేవలం మానవత్వం
ఎదుటి వారిని నమ్మాలి అంటారు పాజిటివ్ గా
ఆలోచించే జనులు
నమ్మేవారిని మోసంచేయాలంటారునెగెటివ్ గా
ఆలోచించే ఘనులు
పవిత్ర స్నేహం పరమానందం,ఆనందదాయకం!
అంశం: పవిత్ర స్నేహం
స్నేహమంటే ఒక ధైర్యం
స్నేహమంటే ఒక అవసరం
స్నేహమంటే ఒక భాద్యత
స్నేహమంటే ఒక భద్రత!
స్నేహమంటే ఇద్దరి మనసుల కలయిక
స్నేహమంటే ఇద్దరి అభిప్రాయాల కలయిక
స్నేహమంటే ఇద్దరి ఆలోచనల కలయిక
స్నేహమంటే ఒక గౌరవం, ఒక నమ్మకం!
కవిత వేరు, కథ వేరు
సినిమా వేరు, జీవితం వేరు
ఒప్పందం వేరు, స్నేహం వేరు
ద్వాపర యుగం, వేరు కలియుగం వేరు
ద్వాపరయుగంలోకుచేలుడు కృష్ణుడి స్నేహంవేరు
కలియుగంలో ఇద్దరి మనుష్యులస్నేహం వేరు!
స్నేహం అమృతం , విషం
అతి స్నేహం అనర్ధ దాయకం
గుడ్డి స్నేహం ప్రమాదకరం
అతి విశ్వాసంతో జీవిస్తే మిగిలేది శూన్యం!
స్నేహాలనునాలుగురకాలుగా విభజించవచ్చు
బాల్య దశ స్నేహాలు , యవ్వనదశ స్నేహాలు
కుటుంబదశ స్నేహాలు , వృద్ధాప్యదశ స్నేహాలు
ఒక్కో దశలో మరెన్నో రకాల స్నేహాలు!
ఒక వ్యక్తి యొక్క మాటల చేతలనుబట్టి
ఆ వ్యక్తి యొక్క గుణ గణాలను చెప్పవచ్చు
ఒక వ్యక్తి యొక్క స్నేహితులను బట్టి
ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చెప్పవచ్చు!
స్నేహమని చెప్పి కుటుంభాల
కూల్చిన వారు లక్షలు
హత్యలు చేసిన వారు కోకొల్లలు
మోసాలు చేసిన వారు కోట్లు
స్నేహం ఎంత వరకు ఉండాలో
అంత వరకుంటేనే సవ్యం!
స్నేహం కనబడని కత్తి లాంటిది
అవసరాల వరకే ఉపయోగించుకోవాలి
ఆ తరువాత దాచి పెట్టు కోవాలి
ఇద్దరి పరిపక్వ మనసుల కలియికలు
స్నేహంగా భావించాలి!
ఆపదలో ఆదుకునేది స్నేహం కాదు
అది కేవలం మానవత్వం
ఎదుటి వారిని నమ్మాలి అంటారు పాజిటివ్ గా
ఆలోచించే జనులు
నమ్మేవారిని మోసంచేయాలంటారునెగెటివ్ గా
ఆలోచించే ఘనులు
పవిత్ర స్నేహం పరమానందం,ఆనందదాయకం!