నమ్మొద్దు దొర మాటలు --- సి. శేఖర్(సియస్సార్)

నమ్మొద్దు దొర మాటలు --- సి. శేఖర్(సియస్సార్)

నమ్మొద్దు దొర మాటలు

పొద్దున్నే కండ్లునులుముకుని
గీయల్టీ పత్రిక జూసిన
గంతే ఒక్కపారి 
పానమంత జలదరిచ్చి
కండ్లు పెద్దగయినవి
వార్నాయినోయ్ గంతే
చింతగింజంతక్షరాలతో
ఒకటిగాదు రెండు గాదు
ఏకమొత్తంలా యాభై వేలంటా
ఏంటివనిజుస్తే ఉజ్జోగాలంట
నమ్మలేని నిజాల్ని పొద్దున్నె జూస్తి
తెలంగాణల గొర్లు బర్లిచ్చి 
కాలమెల్లదీసే సర్కారు
ఉరుకులాడుకుంటా గాలివార్తలెందుకని
 గిపుడున్న గవర్నమెంట్ గాసగాళ్నకే 
ఇయనికి టికానలేదు 
కొత్తవెట్లేస్తరో 
ఉట్టికెగరలేనమ్మ ఆకాసానికెగిరినట్టుంది
కొన్ని కొత్త జెండలు మళ్ళ
తెలంగాణల పానంబోసుకోనికే పాదయాత్రల్జేయ పయనమైతున్నరు
గాళ్ళకు చెక్ బెట్టనికే దొరపన్నిన పాచికాస్త్రం
రైతుబందుమీద సింహాసనమేసకున్న దొర
ఎంతోమంది సదువుకున్న బిడ్డలు
ఉసురు తీసుకుండ్రి 
మతిలేక గతితప్పిన బతుకులాయే
ఎనిమిదేండ్లల్లా ఎండిన జీవితాలెన్నో
హుజురాబాద్ కోసమైతే
పతకం తిరగబడడం ఖాయం
గిపుడ ప్రకటనలై పెద్దక్షరాలే
ఆచరణలో శూన్యమనందరికి తెలుసిక్కడ
మోసపోతే గిట్ల 
మన బతుకుగొంగడి బరువు మనకే భారమైతది
ఎన్నికల జాతర్ల ఎన్నో మాటలొస్తయ్
ఉత్తదే ముమ్మటికుత్తదే

--- సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు.

0/Post a Comment/Comments