బోనాల మహోత్సవం-తెలంగాణ సంస్కృతికి చిహ్నం

బోనాల మహోత్సవం-తెలంగాణ సంస్కృతికి చిహ్నం


బోనాల మహోత్సవం-తెలంగాణ సంస్కృతికి చిహ్నం


తెలంగాణా అస్థిత్వ చిహ్నం బోనాల పండుగ.
అమ్మవారింటికి వచ్చిన ఆడపడుచుల తలపై
తెలంగాణ సాంస్కృతిక వైభవం.
గంధం బొట్లు పెట్టుకుని వెండికళ్ళతో చూసే అమ్మవారి ఘటం...
ఊరేగింపుల కోలాహలం బోనం
ఆషాడ మాసపు ఆరగింపు బోనం..
అమ్మలగన్న అమ్మను ఆడపడుచుగా భావించి తినిపించే భోజనం బోనం
తొట్టి కట్టి ఊయలలూగే గ్రామదేవతల పెద్ద పండుగ బోనం.
శివశక్తుల చిందులతో ఉల్లాసం..
గోల్కొండ జగదాంబలో మొదలై నెల రోజుల పాటు సాగే 
సామూహిక ఉత్సవం బోనాలపండుగ..
అమ్మవారిని ఇంటికి పిలిపించి అన్నం తినిపించే గొప్ప సంస్కృతీ బోనం..
రంగం మీద వీరంగం బోనం..
బోనాల జాతరిలో బోనమే ప్రదానం
లష్కర్ బోనాలంటే అంబరానంటే సంబరం.
కలశంలో అమ్మవారిని ఆవాహనం చేసి 
అత్తింటి నుండి పుట్టింటికి బోనాలు ఎత్తుకుని రావడమే అసలయినా మహోత్సవం..
మంగళ వాయిద్యాలు, భక్తుల నడుమ ఎంతో వైభవంగా 
అమ్మవారికి స్వాగతం పలికేదే బోనాల పండుగ..
జంట నగరాల ప్రజలకు ఇలవేల్పు మహంకాళి అమ్మవారు బోనాల జాతర..
గ్రామదేవతలను ఘనంగా కొలుచుకునే ఈ పండుగలో పోతరాజుది ప్రత్యేక స్థానం..
తెలంగాణా జానపద  సంస్కృతికి విశ్వరూపం బోనాల పండుగ..
తెలంగాణా సంస్కృతికి చిహ్నం ఈ  బోనాల పండుగ..

వి. కృష్ణవేణి
వాడపాలెం.
తూర్పుగోదావరిజిల్లా

0/Post a Comment/Comments