గీతా పారాయణం (కవిత)
--------------------------------------
ఓం ఓంకారాయణ నమః
ఓం గీతాపారాయణ నమః
హరిహర పురహర నమః
మురహరి జయహరి నమ !
గీతాగీతా మా గానాంమృతమాత
శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన గీతా
మాతా మాతా సుందర ఓ సుజాత
ఏతావాతా పారాయణ భగవద్గీత !
శ్వేతా శ్వేతా శాశ్వత మా విజేత
మృదుమధుర మా రస సంగీత
మా మానవ నవజీవన పావన
భావన సంభావన మా సంజాత !
కష్టనష్టాలను తొలగించే గీతమ్మ
మా ఇష్టదైవము ఇక నీవే కదమ్మ
అమ్మ గీతామాతకు శరణం శరణం
మనకిక లేదులే మరణం మరణం !
భగవంతుని భగవద్గీతా మాతాగీత
మా నరుల పావన జీవన సంజాత
స్వర సుర మాధుర్యం రస సంగీత
మంగళ శుభకర శ్రీకర మా సంకేత !
ఓం నారాయణ నమః అంటూ
ఓం గీతా పారాయణం వింటూ
రండి రండిఇక మాభక్తులందరూ
ఆమాత కథలను మీరు విందురు !
పదండి పదండి అంతా ముందుకు
పాంచజన్యమును ఊదేటందుకు
వేయండి వేయండి ఇక మీరంతా
డమరుక దరువులను మాచెంతా !
చేయాలి చేయాలి ఇకమనమంత
అడుగుల భజనను గీతమ్మ చెంత
మోయాలి మోయాలి గీతమ్మ పల్లకి
వేయాలి వేయాలి హరాల ఆ తల్లికి
గతజన్మ వాసనలు అసలే లేకుండ
ఈ జన్మ వినతులే మన మది నిండ
నింపుకొని నింపుకొని ఇక మీరుండ
గీతామాత అందించు అండదండ !
తల్లి గీతా మాతను దర్శిద్దాం మనం
వెళ్ళి పూజలను చేద్దాం అనుదినం
ఆ తల్లి ఇస్తుంది లే ఏదో ఒక వరం
మన బతుకౌతుంది స్వర్గసరోవరం !
గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.