ప్రపంచం జనాభా దినోత్సవం సందర్భంగా..
అధిక జనాభా - తగ్గిన జీవనప్రమాణాలు..
ఆటంకమయ్యెను జీవనభృతికి..
అభివృద్ధి జరిగిన సమముగా అందని
అవకాశాలు జనాభా పెరుగుదలతో..
మూఢనమ్మకాల విశ్వాసమే జనాభా పెరుగుదలకు కారణమై...
లోపించెను మానవత్వం డబ్బువ్యామోహంతో
కుటుంబ పోషణ భారమై నిరంతం
భారమేగా జీవితం జనాభా పెరుగులతో
నిరంతర వనరుల సదుపాయం కరువై.
పెరిగిన నిత్యావసర వస్తువుల వాడకం,
పెరిగిన ధరల పట్టికతో భారమే పెరిగిన జనాభాతో..
జీవనవిధానాలలో మార్పు నాది , నేను అన్నభావన.
ప్రపంచంలో ముందుకు పోవాలనే ఆలోచనతో
పెంచుకుపోతున్న ఖర్చులు ఇవ్వన్ని అధిక జనాభా కారణం.
పెరుగుతున్న జనాభా వల్ల సరిపోని ఉత్పత్తులు..
పెరుగుతున్న, మురికివాడలు..
పెరుగుతున్న జనాభాతో పారిశుధ్య లోపం..
పెరుగుతున్న జనాభాతో పెరిగిన కాలుష్యం
తరిగిపోయిన వన సంపద...
జనాభాపెరుగుదలను అరికట్టడమే ద్యేయంగా ముందుకు నడవాలి ...
వి. కృష్ణవేణి
వాడపాలెం
తూర్పుగోదావరి జిల్లా.