మేము సైతమూ...గద్వాల సోమన్న,గణితోపాధ్యాయుడు,

మేము సైతమూ...గద్వాల సోమన్న,గణితోపాధ్యాయుడు,

మేము సైతమూ...
---------------------------
బడిలోన బాగా
ఆడుకుంటాం
చదువులు చాలా
నేర్చుకుంటాం

మడిలోని మొలకలై
ఎదిగి చూపిస్తాం
గుడిలోని వేల్పులై
మంచి చేస్తాం

ఒడిలోన చేరి
కథలు వింటాం
ఎద పైన  మేము
నిదుర పోతాం

తెలుగులోన మేము
మాట్లాడుతాం
వెలుగు దివ్వెలై
విలువ నిలువుతాం

మేము సైతమూ..
ఉద్యమిస్తాం
తెలుగు వృద్ధికి
ఇల కృషి సల్పుతాం
-గద్వాల సోమన్న,.
 గణితోపాధ్యాయుడు,
సెల్:9966414580

0/Post a Comment/Comments