సృష్టికి మూలాధారం....
ప్రతి జీవికి జీవనాధారం...
పంచభూతాలలో
ఒకటైన ఈ జలం...
మన పంచ ప్రాణాలు
కాపాడే అమృతం....
నాడు జలధార కోసం
భగీరథుడు తపస్సు చేస్తే
నేడు పుడమి తల్లిని
కుళ్ళబొడిచి రంధ్రాలుచేసి
నీటిని వృధా చేస్తూ
మన తనువులో నీరు
లేకుండా చేసుకుంటూ
ఈ సృష్టి వినాశనానికి
మనుషులమే కారకులై
జీవరాశులన్నింటినీ
ఆపదలో ముంచేస్తూ
పుడమితల్లి ఆక్రోశానికి
ఆహుతి అవుతున్నాము...
ఈ నిర్లక్ష్యానికి స్వస్తి పలుకుతూ
మన భవిష్యత్తును మనమే
అంధకారంలో ముంచుకోకుండా
పంచభూతాలను
పంచప్రాణాలుగా
భావించి మన ఉనికిని
మనమే కాపాడుకుందాం...
ఊపిరి నిచ్చే ఉదకాన్ని
మన ముందు తరాల
ఉజ్వల భవిష్యత్తుకు
సురక్షితంగా ఉండనిద్ధాం...
--- దేవసాని కల్పన
కామారెడ్డి