పర్వదినము

పర్వదినము


పర్వదినము

నిశీధి కౌగిట్లో నలుగుతున్న
జీవితాలకు మార్గనిర్దేశం చేసి
ముక్తి అనే వెలుగును ప్రసాదించిన
ఉపాధ్యాయులను దైవంలా భావించి
పూజించే మహోన్నత దినము..!

మసకబారుతున్న బతుకు పుస్తకానికి
అక్షరమనే జ్యోతిని వెలిగించి
నూతన పేజీకి అంకురార్పణ చేసి
జ్ఞానమనే సుగంధాన్ని అద్దిన
గురువులను కొలిచే పర్వదినము..!

సంస్కృతిని వేదాల్లో సంకలనం చేసి
ఆధ్యాత్మిక వారసత్వాన్ని బహుమతిగా ఇచ్చి
భగవంతునికి,భక్తునికి అనుసంధానకర్తయైన
ఆదిగురువు వేదవ్యాసుని స్మరించుకుని
అనుగ్రహమును పొందు విశిష్టదినము..!

లక్ష్మీ చిహ్నమైన కొత్తవస్త్రంలో బియ్యంఉంచి
కార్యసిద్ధికి సూచనైన నిమ్మ పళ్ళనుంచి
భక్తి శ్రద్ధలతో పెద్దలను పూజించి
వారి మార్గదర్శకత్వమును అందిపుచ్చుకునే
మహిమాన్విత దినము వ్యాస పూర్ణిమ..!

పిల్లి.హజరత్తయ్య
శింగరాయకొండ
ప్రకాశం జిల్లా


0/Post a Comment/Comments