"జ్ఞానదర్శిని - దూరదర్శిని" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

"జ్ఞానదర్శిని - దూరదర్శిని" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

జ్ఞానదర్శిని - దూరదర్శిని


సమాజానికి విజ్ఞానాన్ని వినోదాన్ని పంచి
సమాజశ్రేయస్సుకు దేశాభివృద్ధికి
దోహదంచేసే తెలుపునలుపు చిత్రాల
టెలివిజన్ సామాన్యుని నట్టింట
దర్శనమిచ్చి ఆనందాన్నిచ్చే
అద్భుత సాధనం

రెండు జ్ఞానేంద్రియాలకు సమాచారాన్ని
అందించే సాధనం టెలివిజన్
పటిష్టత కలిగిన మాధ్యమంగా
తక్షణత్వాన్ని ప్రచారతత్వాన్ని కలిగి
విస్తృత పరిధి ఋజుత్వం ఆకర్షణీయతతో
సామాన్యుని ఇంట్లో సమాచారమిచ్చే
ప్రజామాధ్యమం టెలివిజన్

న్యాయసలహాలు ధర్మసలహాలు
ఆరోగ్యకార్యక్రమాలు వ్యవసాయవిజ్ఞానం
కళాతోరణం వార్తలువంటి
పలుకార్యక్రమాలు వెలువరించి
జానపదాలలో కూడా విజ్ఞానాన్ని
అందించే శ్రవ్య దృశ్య సాధనం

జానపదులకు సేదతీర్చే సాధనం
జ్ఞానాన్నిపెంచే గురువు
చెవికి కంటికి ఆహ్లాదాన్నిచ్చే
దూరదర్శిని నేడు కనుమరుగాయె

ఆచార్య ఎం రామనాథం నాయుడు
మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments