స్వర్గసీమ
---- డా.రామక కృష్ణమూర్తి,
బోయినపల్లి, సికింద్రాబాద్.
పచ్చని ప్రకృతిలో
పరవశించిన ఉషోదయం.
తాటిచెట్ల తన్మయాలు
కొబ్బరిచెట్ల తియ్యందనాలు
పెంకుటిళ్ళ చల్లదనాలు
నడిచే దారంతా స్వాగతాలు
పలుకుతున్న హరితనేస్తాలు.
పల్లెకు ప్రకృతి అద్దుతున్న పచ్చందనాలు
స్వేచ్ఛగా వీస్తున్న స్వచ్ఛ గాలులు
పంటపొలాల పైనుంచి వస్తున్న పరిమళాలు
అమందానంద ఆహ్లాదాలు
అమృతమయ జీవనాలు
ఉదయమైనా,సాయంత్రమైనా
వన్నె తగ్గని సోయగాలు
తల్లి లాంటి ప్రేమనందించే
పల్లె ముఖద్వారపు స్వాగతాలు
దేశాభివృద్ధికి పట్టుగొమ్మలై
ఆత్మస్థైర్యంతో నిలుస్తున్న పల్లెలు
ప్రగతికి సోపానాలు
జగతికి స్వర్గసీమలు.