బక్రీద్..!(కవిత)
"త్యాగాల పండుగ"..
బక్రీద్ త్యాగానికి ప్రతీక..!
"అల్లాహ్" దారిలో త్యాగానికి
సిద్ధమయ్యే వారికి సంబంధించిన పండుగ..!
"అల్లాహ్"(దేవుడు) కోసం
ఇష్టమైన దానిని "త్యాగం" చేయడం..
పండుగ పరమార్థం..!
"అల్లాహ్" ను ఒప్పించడంలో
ఏ త్యాగానికైనా సిద్ధపడాలి..!
"అల్లాహ్" పట్ల విశ్వాసం..
బక్రీద్..!
"అల్లాహ్" తో పశ్చాతాపం ..
బక్రీద్..!
"అల్లాహ్" పరీక్షను ఎదుర్కొనడం..
బక్రీద్..!
"అల్లాహ్" ప్రీతి కొరకు,
ప్రాణ త్యాగానికైనా సిద్దం..
అదే బక్రీద్..!
"హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం" ప్రవక్త ఆరంభం.. బక్రీద్..!
ముస్లిం సోదరులందరికి,
ఈదుల్ అద్ హా (బక్రీద్)
శుభాకాంక్షలతో..!
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ