చాలు... చాలు... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

చాలు... చాలు... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

చాలు... చాలు...

ఒక చిరునవ్వు చాలు
చింతలు చీకాకులు ఎగిరిపోవడానికి...

ఒక చల్లని చూపు చాలు
ఆరని కన్నీటిధారలు ఆగిపోవడానికి...

ఒక మధురమైన మాట చాలు
గుండెల్లో రగిలే మంటలు చల్లారడానికి...

ఒక అభయహస్తం చాలు
నీ వెనుక నేనున్నానని భరోసానివ్వడానికి...

ఇంత చేయూత నిస్తే చాలు
పడిపోయిన వారు తిరిగి పైకి లేవడానికి...

గోరంత ఆధారముంటే చాలు
చెడిపోయిన వారు తిరిగి బాగుపడడానికి...

గుప్పెడంత ఆశ వుంటే చాలు
విడిపోయిన వారు మళ్ళీకలిసి జీవించడానికి...

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్... 9110784502






0/Post a Comment/Comments