మేలుకొలుపు
ఓ మనిషీ!
నీవు ఇంతగా ఎదగడానికి కారణం ఎవరు?
నీ స్వార్ధం నీవే చూసుకుంటావా?
నీలో శక్తి ఉంది
నీలో యుక్తి ఉంది
నీలో బలం ఉంది
నీలో తెలివి ఉంది
నీలో కరుణ ఉంది
నీలో అందం ఉంది
నీలో దాన గుణం ఉంది
నీలో మంచి మనసు ఉంది!
నిను గన్న తలిదండ్రికి నీవేమి చేశావు?
నిను గన్న భరత భూమికి నీవేమి చేశావు?
నిరంతరం నీకు సేవలందించిన
ఈ సమాజానికి ,దేశానికి ప్రతిఫలంగా
నీవేమి అందించావు!
నీ వృద్ధ తలిదండ్రులు నిస్సహాయతతో
నీ సహాయానికి ఎదురు చూస్తున్నారు!
నీ అక్కా , చెల్లెండ్లు , అన్నా దమ్ములు
నీ సహాయానికి ఎదురు చూస్తున్నారు!
నీ బంధు మిత్రులు , ఆపన్నహస్తాలు
నీ సహాయానికి ఎదురు చూస్తున్నాయి!
నిస్వార్ధంగా నీ ఎదుగదలకు
ఇతోదికంగా సాయపడిన ఈ సమాజం
అనేక సమస్యలతో , కరోనా వైరస్ లతో
సతమత మవుతున్నది
నీ నుండి యేదో సహాయం కోరుకుంటుంది!
నీకు చదువు చెప్పిన గురువు
నీ నుండి యేదో కోరు కుంటున్నాడు!
నీకు నిరంతరం వైద్య మందించిన డాక్టర్
నీ నుండి యేదో ఆశిస్తున్నాడు!
నీకు అన్నం పెట్టిన రైతన్న
నీ నుండి ఏదో కోరు కుంటున్నాడు!
నీ దేశాన్ని నిరంతరం కంటికి రెప్పలా
దేశ సరిహద్దులలో కాపలా కాచే సైనికులు
నీ సహాయం కొరకు ఎదిరి చూస్తున్నారు!
నీకు పలు విధాలుగా సహాయం అందించిన
నీ మాతృ భూమి నీ నుండి యేదో ఆశిస్తుంది
తెలుసుకున మేలుకో!
తీర్చుకో
నీ ఋణం తీర్చుకో
బరువు తగ్గించుకో
మళ్ళీ ఈ అవకాశం
మరిక రాదు
ఇది సత్యం!
ఇంకను ఏమని వివరించను
నిను మేలు కొలుప!
- మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్