పసి హృదయం
పసిపిల్లల మని మేము పసిపిల్లల మని
మా జీవన గమనం దారులలో అడ్డు నిలుస్తారు ఎందుకు?
మీ ఆలోచనల నడుమ కట్టడి చేసి, ప్రేమ పాశాన్ని మాకు చుట్టి ,
ఈ దేహాలను బంధిస్తారు ఎందుకు ?
మా శోధనలు తిరస్కరిస్తారు ఎందుకు?
మా మనసులు స్వేచ్ఛా విహంగాలు
మీ ఊహలకందని రేపటి సత్యాలు
ఒక్కసారి మా లోకం లోకి అడుగు పెట్టి చూడండి
మా ఆలోచనలు లోకి తొంగి చూడండి
మా శోధన లకు మార్గం తెరవండి
జన్మనిచ్చింది మీరైనా నా ఈ జన్మ నాది
నన్ను నాలానే బతకనివ్వండి
దేహం మీ నుండి వచ్చింది కానీ దైవం నాకు పురుడు పోసింది
తెలిసో తెలియకో మూసిన మా ఆశయ ద్వారాలు, ఆకాంక్షల తీరాలు ,
ఊహల్లో ఉరకలు వేస లక్ష్యాలు..
మేము నిర్ణయించుకున్న ఆశయ సౌధాలు..
మా జీవన వికాసానికి మీరు చూపే దిశానిర్థేశాలు...
ఇకనైనా మేల్కోండి, నిజాన్ని ఎక్కుపెట్టి ,
సత్య తీరాలలో బాటసారులు గా చేరి ,
ఆత్మ తత్వం గ్రహించండి. భగవత్తత్వం తీరమవుతుంది
శోధన శోధన నిలయానికి మీ ప్రయత్నం మొదలవుతుంది
మా పసి హృదయాలకి ప్రేరణ మొదలవుతుంది
మీ
ఇడుకుల్ల గాయత్రి