అప్పు ఒక.. ముప్పు..! --- ముహమ్మద్ ముస్తఖీమ్ - విన్నర్

అప్పు ఒక.. ముప్పు..! --- ముహమ్మద్ ముస్తఖీమ్ - విన్నర్

అప్పు ఒక..ముప్పు..!

అడ్డూ అదుపూ లేని అప్పులు..!
కలిగించును ఎనలేని తిప్పలు..!?
అప్పు తీసుకోవడం, 
చాలా సులువు...!
నీళ్ళు పట్టుకుని, 
తాగినంత గా..!
అదే అప్పును తీర్చడంలో కష్టాలు తెలిసి వస్తాయి..!??
"ఎందుకన్నా తీసుకున్నాం రా దేవుడా"... అనిపిస్తుంది..!
అప్పిచ్చిన వాడు ముళ్ళలాంటి, చాకు లాంటి మాటలతో.. గుచ్చుతుంటే..!?
అప్పు తీసుకున్నప్పుడు 
ఏం ఆలోచించం,
ఓ తీర్చవచ్చు లే..! నని స్వయం కితాబు ఇచ్చు కుంటాం..!
పరిస్థితులు అనుకున్నట్లు ఎప్పుడూ ఉండవు కదా..!??
తీరా అప్పు ఒక ముప్పు గా 
పరిణమించినట్లు తోస్తుంది..!??
ఒత్తిడి ఎక్కువైనప్పుడు..!??
అప్పిచ్చువాడు
అసలు లేదు..
వడ్డీ లేదని ..నిలదీస్తుంటే,
పైసల సంగతి బజారు కీడ్చినట్లు,
వీధిలో ఇంటి ముందర గట్టిగా అరుస్తుంటే..
కొట్లాడుతుంటే..
ఇహ చూడాలి, ఇరువైపుల 
వాదోపవాదాలు..
తిట్లూ - దుర్భాషలు..
గల్ల పట్టుకొని, ఒకర్నొకరు తోసుకుంటుంటే..
చుట్టుముట్టిన జనాలు ..ఏమైందని..!??
అడుగుతుంటే..
చూడండయా..డబ్బులు తీసుకొని ఇవ్వట్లేదు, అంటూ..
ఉన్న గౌరవం గాలిలో 
కొట్టుకు పోయినట్లు..!
ఆత్మాభిమానం కోల్పోయినట్లు..!
ఇంకేమి మిగిలి ఉండనట్లు..!??
చివరికి జ్ఞానోదయమైంది..
అప్పు ఒక ముప్పు అని..!

రచన:✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments