గురువు గొప్పతనం బెజుగాం శ్రీజ

గురువు గొప్పతనం బెజుగాం శ్రీజ


గురువుగొప్పతనం


సీసమాలిక

విద్యతోపాటుగ విజ్ఞానమునుపంచి
సంస్కారమునునేర్పు శ్రమకునోర్చి
తప్పులుసరిదిద్ది దైవమై మనపట్ల
దేశభక్తినిచాటు తేజముగను
అజ్ఞానమనియెడి నంధకారముబాపి
విజ్ఞానమనియెడి వెలుగునిడునె
గురువుయెవిష్ణువు గురువుయెదైవంగ
మోక్షంబునిచ్చునే మోదమలర
గురువుయెసాక్షాత్తు పరబ్రహ్మ సమవుజ్జి
బాధపెట్టవలదు బ్రహ్మ యతడు
గురువు మార్గంబులో గొప్పగమసలిన
దేవునంతటిగొప్ప దీవెనిడుగ

తేటగీతి

నిత్యముకృషిని జేస్తూనె నేర్పుగాంచి
అక్షరజ్యోతినింపునె యందముగను
వందనంబులు పాదాభి వందనంబు
మరువబోమయ్యమిమ్ములమదినినెపుడు

బెజుగాం శ్రీజ
ట్రిపుల్ ఐటీ బాసర, ద్వితీయసంవత్సరం
*గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట*

0/Post a Comment/Comments