కుండపోతగా వర్షం కురుస్తోంది
నేడు వార్తలు
చదువుతున్నది వరదరాజులు...
బంగాళాఖాతంలో
అల్పపీడన ద్రోణి ఏర్పడి
పెనుతుఫాను తీవ్రతుఫానుగా మారి
అన్నిప్రాంతాల్లో
పలు రాష్ట్రాల్లో అనేక దేశాల్లో
పెనుగాలులతో
కుండపోతగా వర్షం కురుస్తోంది
ఎటుచూసినా జలదిగ్బంధంలో జనం
చెరువుగుండెలకు గండిపడింది
జనజీవనం స్తంభించిపోయింది
జీవితం అతలాకుతలమైపోయింది
వాగులు వంకలు నదులు వరదలతో పోటెత్తి
ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి
లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి
ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చి ఖరీదైన వస్తువులు
వాహనాలు కళ్ళముందే కొట్టుకుపోతుంటే
నిరాశ్రయులైన ప్రజలు
నిస్సహాయిలై ప్రాణాలు అరచేతపట్టుకొని
కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు
లక్షలమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు
సహాయక శిబిరాలకు తరలించారు
నిత్యావసరాలను అందిస్తున్నారు
వృద్దులు వికలాంగులు గర్భిణి స్త్రీల
ఆకలికేకలు పసిపిల్లలు పాలకోసం ఆరాటం
చుట్టూ నీరున్నా దాహం తీరక
నీళ్ళ ప్యాకెట్లకోసం ఆహారం పొట్లాల కోసం
ఆశతో ఆకలితో కన్నీళ్లు ఇంకిన కళ్ళతో
ఆపన్నహస్తాలకోసం ఎదురు చూస్తున్నారు
జాతీయ రహదారులు
జలమయమై
నదులను తలపిస్తున్నాయి
ఎగిరి పోయిన ఇంటిపైకప్పులతో
కూలిపోయిన భారీ వృక్షాలతో
విరిగిపోయిన విద్యుత్ స్తంభాలతో
వాహనదారులకు రాకపోకలకు
తీవ్రఅంతరాయమేర్పడింది
కొండ చరియలు విరిగిపడి
మట్టిలో చిక్కుకుపోయిన జనం
కారుచీకట్లో పలుకాలనీలు
నీట మునిగిన పంటపొలాలను
మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యం చూసి
మిన్నంటిన అన్నదాతల ఆక్రందనలు
ప్రాజెక్టులు నిండుకుండలా
జలకళను సంతరించుకున్నాయి
365 రోజుల వర్షపాతం 3 రోజుల్లో కురిసి
అత్యధిక వర్షపాతం నమోదై 1000
సంవత్సరాలనాటి రికార్డులు బద్దలైపోయాయి
మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని
వేటకు వెళ్ళరాదని వాతావరణంశాఖ హెచ్చరిక
ముంపుకుగురైన ప్రాంతాల్లో అంటువ్యాధులు
వెంటపడతాయని ఆరోగ్యశాఖ అధికారులఆందోళన
ఇంతటితో వరదల వార్తలు సమాప్తం....
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్... 9110784502
నేడు వార్తలు
చదువుతున్నది వరదరాజులు...
బంగాళాఖాతంలో
అల్పపీడన ద్రోణి ఏర్పడి
పెనుతుఫాను తీవ్రతుఫానుగా మారి
అన్నిప్రాంతాల్లో
పలు రాష్ట్రాల్లో అనేక దేశాల్లో
పెనుగాలులతో
కుండపోతగా వర్షం కురుస్తోంది
ఎటుచూసినా జలదిగ్బంధంలో జనం
చెరువుగుండెలకు గండిపడింది
జనజీవనం స్తంభించిపోయింది
జీవితం అతలాకుతలమైపోయింది
వాగులు వంకలు నదులు వరదలతో పోటెత్తి
ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి
లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి
ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చి ఖరీదైన వస్తువులు
వాహనాలు కళ్ళముందే కొట్టుకుపోతుంటే
నిరాశ్రయులైన ప్రజలు
నిస్సహాయిలై ప్రాణాలు అరచేతపట్టుకొని
కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు
లక్షలమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు
సహాయక శిబిరాలకు తరలించారు
నిత్యావసరాలను అందిస్తున్నారు
వృద్దులు వికలాంగులు గర్భిణి స్త్రీల
ఆకలికేకలు పసిపిల్లలు పాలకోసం ఆరాటం
చుట్టూ నీరున్నా దాహం తీరక
నీళ్ళ ప్యాకెట్లకోసం ఆహారం పొట్లాల కోసం
ఆశతో ఆకలితో కన్నీళ్లు ఇంకిన కళ్ళతో
ఆపన్నహస్తాలకోసం ఎదురు చూస్తున్నారు
జాతీయ రహదారులు
జలమయమై
నదులను తలపిస్తున్నాయి
ఎగిరి పోయిన ఇంటిపైకప్పులతో
కూలిపోయిన భారీ వృక్షాలతో
విరిగిపోయిన విద్యుత్ స్తంభాలతో
వాహనదారులకు రాకపోకలకు
తీవ్రఅంతరాయమేర్పడింది
కొండ చరియలు విరిగిపడి
మట్టిలో చిక్కుకుపోయిన జనం
కారుచీకట్లో పలుకాలనీలు
నీట మునిగిన పంటపొలాలను
మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యం చూసి
మిన్నంటిన అన్నదాతల ఆక్రందనలు
ప్రాజెక్టులు నిండుకుండలా
జలకళను సంతరించుకున్నాయి
365 రోజుల వర్షపాతం 3 రోజుల్లో కురిసి
అత్యధిక వర్షపాతం నమోదై 1000
సంవత్సరాలనాటి రికార్డులు బద్దలైపోయాయి
మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని
వేటకు వెళ్ళరాదని వాతావరణంశాఖ హెచ్చరిక
ముంపుకుగురైన ప్రాంతాల్లో అంటువ్యాధులు
వెంటపడతాయని ఆరోగ్యశాఖ అధికారులఆందోళన
ఇంతటితో వరదల వార్తలు సమాప్తం....
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్... 9110784502