సేవా తత్పరత --- మార్గం కృష్ణమూర్తి, హైదరాబాద్.

సేవా తత్పరత --- మార్గం కృష్ణమూర్తి, హైదరాబాద్.

మార్గం కృష్ణ మూర్తి

సేవా తత్పరత

పుష్కలం ఫలాల నందించు కల్పతరువులు
అమృతాన్ని అందించు సంజీవనీ నదులు
సకల సంపదల నందించు సప్త సముద్రాలు
వజ్ర వైఢూర్యాలను అందించు ధరణి మాత
చల్లని వెన్నెల నందించు పున్నమి చంద్రుడు
వేడి, వెలుతురు కిరణాలను విరజిమ్మే భానుడు

జీవరాశిని  మోసే పుడమి తల్లి
మనకు జన్మ నిచ్చిన మాతృమూర్తులు
ఈ పకృతీ , పంచ భూతాలు
ఏమి ఆశించి అందిస్తున్నాయి మనకు ఫలాలు?
ఏమి ఆశించి చేస్తున్నాయి మనకు సేవలు?

ప్రకృతి నుండి ఎన్నియో నేర్చుకుంటూ
మనిషి గాలి మేడలలో తేలిపోతో
గగన మందున విహరిస్తూ
ఆనందంతో పరవసిస్తూ, హాయిగా జీవస్తూ

ఎందుకీ సంకుచిత భావాలు?
ఎందుకీ స్వార్థ చింతన?
ఎందుకీ ఈర్ష్య ,అసూయ , అహంభావాలు?
మనిషికీ ఎందుకు ఈ కుటిల మనఃస్థత్వాలు?

వచ్చే టపుడు ఏమీ తేలేదని తెలుసు
పోయే టపుడూ ఏమీ తీసుకెళ్ళమనీ తెలుసు
శ్వాస ఆగాక తన నెవరు తాక రారనీ తెలుసు
అయినను వీడడు మనిషి తన లోభి మనసు

చేసిన సేవా తత్పరత మనకు సంతృప్తి నిచ్చు
మనం చేసిన పుణ్యమే మన వెంట వచ్చు
మనం చేసిన దానమే పలుగురికి ఆదర్శమిచ్చు
మనం చూపిన ధర్మమే పది కాలాలు నిలుచు
మనం చూపిన ప్రేమనే మనలను గుర్తుకు తెచ్చు

--- మార్గం కృష్ణమూర్తి,
హైదరాబాద్.

0/Post a Comment/Comments