అనురాగ దేవత అమ్మ--గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు.

అనురాగ దేవత అమ్మ--గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు.

అనురాగ దేవత అమ్మ
--------------------------------
అమ్మ మనసు చల్లన
మల్లె వోలె తెల్లన
ఆమె ఇంట దీవెన
ఎదుగుదలకు నిచ్చెన

అసమానము త్యాగము
సదనములో దీపము
అమ్మ ప్రేమ రూపము
అనురాగపు ధూపము

అమ్మ దైవ కానుక
మమకారపు మాలిక
సంతోషాల వేదిక
ఆమె ఉన్న వేడుక

సాటిలేని ఓపిక
పుడమియంత సాత్విక
విజయోత్సవ గీతిక
వెలుగునిచ్చు దీపిక

అమ్మ ప్రేమ శ్రేష్ఠము
ఆమె స్వర్గధామము
చూడు తల్లి క్షేమము
కుటుంబాన హేమము

అమ్మ మాట వేదము
సిరిమువ్వల నాదము
ఆమె ఘనత చాటుము
ప్రేమతోడ చూడుము

--గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు,
ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments