సవ్యసాచి- దాశరథి కృష్ణమాచార్య
సీ.
సాహిత్య శిఖరమా సంస్కార గుణధామ
స్వాతంత్ర్య యోధుడా సవ్య సాచి
నరులకన్నీళ్ళనునగ్ని ధారగ మార్చి
దాశరథిమహర్షి దయను చూపె
నాతెలంగాణనే నాకోటి రతనాల
వీణనిధైర్యంగవిశదపరిచె
నివురును కప్పిన నిప్పువ లెనిజాము
మెడలును వంచియు హడల గొట్టె
తే.గీ.
చిన్న గూడూరు జన్మవి శేష పరిచి
మంచి గ్రంధములరచించి మంచి పెంచె
తెలుగు నేలకు ఎంతయో దిగులు తీర్చె
బిరుదు లెన్నియో పొందిన మురువ కుండ
దాశ రథికృష్ణ మాచార్య ధన్యు డయ్యె
---మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్