బంజార స్త్రీల కన్నీటి గాధ
మురళీ జాదవ్
ఢావలో
""""""""""""""""""""""""""""""""""""
స్వరపేటికలో ఉద్భవించే
వసంత కాలపు కోకిల కూతలా
హృదయ గాధను వినిపించుటకు
ఊపిరి పాటగా అందుకున్న పల్లవి ఢావలో
ప్రతి పదానికి నిండు నిగూఢమైన అర్దంతో
మనసునిండ అలుముకున్న దుఃఖాగ్నిని
కంటి చెల్మల నుండి పొంగిన చలువతో
చల్లార్చుకోనుటకు *యాడిల వేధన *ఢావలో
అనాడు మోయలేని బరువులు మోసి
చెక్కుచెదరని సంస్కృతిని శరీరం నిండ దాచి
సంతోషమైన సందేహమైన
సవినయంగా వర్ణించే రాగాలాపనే ఢావలో
బాధనంత హృదయ కవటంలో బంధించి
పొంగె ధారాలను దోసిళ్ళు నింపి,
సిరచుక్కల మలిచి, మనసు గ్రాంథాలయం
నుండి సేకరించిన మౌఖిక కవిత్వమే ఢావలో
ఆత్మీయ ఆలింగనంతో *నవలెరి
పాషాణ పాత్రనైన పలకరిస్తుంది కన్నీటి తడితో..
ఎదలోతులో పుట్టిన అలజడి కడలి అలలగా
కనురెప్పల చాటు మేఘమై వర్షింపెదే *మళెరో..
తాండ ఓడిలో లేడి పిల్లల గంతులేసిన జ్ఞాపకం
తీజ్ పండుగ దీపావళికి కలిసి ఆడిన నేస్తిలు
కన్నపేగుకు తోటమాలిలు తల్లిదండ్రి తోబుట్టు
కదిలే జ్ఞాపకాల ముల్లె కట్టి సాగే *తాంగ్డికి కన్నీటి నిరాజనమే*హవేలి
భిడారు *గేలపై *శోంబ్లి దాదీ గుంగ్టో ముస్కుతో
తనకు ఒంటరిని చేసిన *సాహేబా కోరకు
ఒక్కొక్క ఆశృతమొగ్గలు రాలుస్తూ
అల్లుకుంటూన్న కవిత్వవిలాపనే *వడావ్
*మురళీ జాదవ్*
ఉపాద్యాయులు
ఉట్నూర్,ఆదిలాబాద్ జిల్లా
తెలంగాణ
••••••••••••••••••••••••••••••••••••••
యాడిలు = బంజార స్త్రీలు లేదా తల్లులు
నవలేరి = నవ వధువు
శోంబ్లిదాదీ= శోంబ్లి అనే పేరు గల అవ్వ
సాహేబా = భర్తను పొగిడే పదం
గేల = అడవి లో పశువులు నడిచి ఏర్పడిన పిల్ల దారి
హవేలి = రాజస్థాన్ పదం దీని అర్దం రాజ భవనం లేదా మాహల్
వడావ్ = క్రోదమైనా ఏడుపు.
******************************
హామీస్తూన్నాను..ఇది నా స్వీయ రచన🙏
••••••••••••••••••••••••••••••••••••••