నట్టింట ఉలుకని
నాదస్వర నాథుడు
నెట్టింట పలుకుతు
నా(చా)ట్యాలు చేస్తాడు
ఇంటి జవరాలితో
మాట ముచ్చట లేదు
నెట్టింటి కొమరాలుతో
కాపురమే చేస్తాడు
లంచాలు అడిగినోన్ని
భరతంపడతానంటాడు
భరతంపట్టడానికి
లంచాలు అడుగుతాడు
పంటకీడను చంప
పైజల్లె మందులను
కీడ పోలేగాని
కర్షకుడే ఖతమాయె
నవ్వించి బతికెదరు
నట సార్వభౌములు
బతుకులోని వెతలకు
నవ్వు పూతలు పూసి
ఆకాశ హర్మ్యాల
జీవనపు గమనమున
పాతాళమంటిన
సుఖములే యుండును
--- డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
9963991125