రెండు మనసుల కమనీయ
దృశ్యకావ్యం ప్రేమ
రెండు హృదయాలను
దరిచేర్చి ఒకటిగా ముడివేసే
బంధమే ప్రేమ
లోకాన్ని సరికొత్తగా చూపించేదే ప్రేమ
కాలాన్ని కనుమరుగు చేసేది ప్రేమ
ఇరువురి తనువులు వేరైనా
మనసులను జత కలిపే బంధమే ప్రేమ
ఇరువురు జీవితాల్లో వసంతంలా సరికొత్త తలపులను నింపునది ప్రేమ
ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ క్షణాలను యుగాలుగా తలచి మదిలో గుబులురేపునది ప్రేమ
ఇరువురు తనువులు వేరైనా రెండు మనసుల ప్రణయమే ప్రేమ
ఈ కలయిక లో జీవన పయనాన్ని సాగిస్తూ హరివిల్లుల రంగులను అద్దుతూ
ఇరువురి మదిలో నిండే కావ్యమే ప్రేమ.
*******************************
పేరు: శ్రీమతి ఐశ్వర్య రెడ్డి గంట
ఊరు:హైదరాబాద్
వృత్తి:బిజినెస్ కన్సల్టెంట్