మహా ధర్మం

మహా ధర్మం

ధర్మం మహా ధర్మం

ధర్మం
మానవుడై జన్మించినందుకు  జీవించడం ధర్మం...

జీవించే హక్కు పొందినందుకు.,పెద్దలను  సేవించడం
ధర్మం.....

సెవించిన పిల్లలను పెద్దలు ప్రేమించడం ధర్మం....

ప్రేమించే హక్కు పొందిన మనిషికి
బందుత్వం గొప్ప ధర్మం...

బందుత్వం  నిలుపుకొనుటకు
స్నేహంగా మెలగడం ధర్మం.....

స్నేహం నిలుపుకొనుటకు
నిజాయితీగా ఉండడం ధర్మం.....

నిజాయితీ నిలుపుకొనుటకు
ఆత్మ శుద్ధి కలిగి ఉండడం ధర్మం.....

ఆత్మ శుద్ధి కలిగి ఉండటం కోసం
మనిషి ఏకాంతం ఒక ధర్మం....

ఏకాంతం కలిగి ఉండుటకు
ద్యానం చేయడం గొప్ప ధర్మం.....

అలనాడు మన చరిత్ర లో

పితృ ధర్మాన్ని పాటించెను రాముడు....

రాముడు వెంట నడిచి పత్ని ధర్మాన్ని
పాటించెను సీత .....

రాముడికి తోడై నడిచి
బందుత్వ  ధర్మాన్ని పాటించే లక్ష్మణుడు....

శ్రద్దగా  స్వామిని సేవించి భక్తి ధర్మాని పాటించే హనుమంతుడు.....

రాక్షస వంశాన పుట్టి వేద ధర్మాన్ని పాటించే విభీషణుడు......

గీత ద్వారా ధర్మ సుక్ష్మాలు  బోదించె  కృష్ణుడు

అందుకే ధర్మాన్ని రక్షించడం మన మహా ధర్మం....


ఇడుకుల్ల గాయత్రి

0/Post a Comment/Comments