పండుగలప్రాశస్త్యం
--డా. రామక కృష్ణమూర్తి
బోయినపల్లి, మేడ్చల్.
సమష్ఠి భావనే సంకల్పం
ఐకమత్యమే లక్ష్యం
సమాజ హితమే సందేశం
కలిసి ఉండుటే సాక్ష్యం
పంచుకొనుటే పరమార్థం
ధార్మికతే దర్శనం
సుబోధలే శరణ్యం
చెడుపై మంచి విజయం
ఆనందంతో కేళీవిలాసం
ఉత్తమగుణమే ఆదర్శం
అవతార విశ్వరూపమే సందర్శనం
ధాన్యరాసుల ఆగమనం
పశువులకు కృతజ్ఞతాభావం
పేరంటాలకు శ్రీకారం
ప్రకృతిపై మమకారం
నిత్యం సత్యశోధనం
పేదవారి కడుపు నింపే ఔదార్యం
ఆనందం,సోదరభావం
భక్తి,అనురక్తి,ముక్తి
ద్వైతాద్వైత నియుక్తి.