నిశీధిని
సృష్టి కార్యాలకు నిశీధిని అనువైన సమయము
సృష్టి రహస్యాల ఛేదనకు అనుకూలమైన నిమిషము
చరాచర జీవరాసులకు విశ్రాంతి కాలము
చైతన్య స్ఫూర్తిని రగిలించే అద్భుతము
భారతీయులకు స్వాతంత్ర్యము సిద్ధించినది నిశీధిలోనే
చీకట్లు కమ్మిన జీవితాలలో కాంతిరేఖలు పూయునది రాత్రిలోనే
కష్టసుఖాలు పగలు రాత్రి లాంటిదేనని తెలిపే సూచిక
కార్యసాధకులకు కమ్మటి ఆలోచనల వేదిక
ప్రకృతి పరవశించడానికి రాత్రియే మూలము
ప్రకృతి నియమాలు పాటించడానికి ఇదియే ఆధారము
అజ్ఞానాంధకారాన్ని తొలగించు ఘడియలు
మానవాళి జీవితంలో ముఖ్యమైన ఘట్టములకు పునాదులు
ఆలుమగలు అలకలు తీర్చుకొనే ఏకాంతము
అలసిన ప్రాణాలు సేద తీర్చుకునే స్వాంతనము
నిశీధిని లేనిదే మనిషి బతుకు లేదు
రాత్రి కానిదే మానసిక ప్రశాంతత చేకూరదు
పిల్లి.హజరత్తయ్య, శింగరాయకొండ