కలాం నీకు సలాం
కలామ్ నీకు సలాం
నీ కర్తవ్యానికి మేం గులాం
నీ వ్యక్తిత్వానికి మేం సలాం
నీ ఔన్నత్యమైన హుందాతనానికి గులాం
మిస్సైల్ మ్యాన్ విశ్వయశస్వినీకు సలాం
కలలు కనమన్నావ్
అవి నెరవేర్చుకో మన్నావ్
కలలు కన్నావ్
నువ్వు నెరవేర్చుకున్నావ్
శాస్త్రవేత్త వి అయ్యావ్
దేశనాయకడవయ్యావ్
నీ మాట నీ బాట
ప్రగతి బాట
నీ చేత నీ రాత
భారత తలరాత
3క్షిపణులను అందించావ్
రక్షణోద్యోగి గా ఉన్నావ్
ఓటమిని ఒప్పుకోమన్నావ్
విజయాన్ని తెచ్చుకోమన్నావ్
ఏదైనా ఆహ్వానించాల్సిందే
చిరునవ్వుతో ఎదుర్కోవాల్సిందే
కష్టమే అదృష్టంఇష్టమే లాభం
నష్టమే పాఠంవిజయమేగుణపాఠం
పద్మభూషణ్ పద్మవిభూషణ్
నీకు కీర్తి కిరీటాలు
మా సారధివి రథసారథివి
మామహారధివి మహోన్నతవి
మనదేశ ప్రధమ పౌరుడిగా
ఖ్యాతి నొందావ్ కలాం నీకు సలాం
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
టీచర్ సాలూరు
విజయనగరం జిల్లా
9441530829