బక్రీద్ శుభాకాంక్షలు
'ఈద్ ఉల్ అద్హా' బక్రీద్ కు మరో పేరు త్యాగానికి గుర్తు ఈ పండుగ
హజ్ యాత్ర చివర
ఈ పండుగను నిర్వహిస్తారు
మానవవులం మనం,
మానవీయత మన అభిమతం,
మతాలన్నీ బోధించేది,
ఇంచుమించు ఒకటే,
ప్రపంచ జనాభాలో,
రెండవ స్థానం ముస్లింలది,
"జకాత్" అన్న నియమం
ఉన్న వాడు లేనివానితో మిలాఖత్
అవ్వటమే,
దానం చేయమని అన్ని మతాలు బోధిస్తే,
ఖురాన్ ఈ విషయంలో
ఎంతో అభ్యుదయ భావనలకు
నాంది పలకటం విశేషం,
ప్రతి ధనవంతుడు,
ఏడాది సంపాదనలో,
మిగిలినిదానిలో మూడింట ఒక వంతు,
నిరుపేదవకు దానంచేయాలని నియమం,
ఈ నియమం నిజంగా అందరూ ఆచరిస్తే
పేదల పరిస్థితి ఇంత దయనీయంగా ఉండేదా,
అందుకే జకాత్ అన్న నియమం
ఖురాన్ ప్రత్యేకత,
మనలో ఒకరైన మన సోదరులు,
ఖురానీయులై అల్లాహు..అగ్బర్ అల్లా!
అంటూ ప్రతి పూట క్రమం తప్పక
ఐదువెళ్ళకు ప్రతీకగా ఐదు సార్లు
నవాజ్ ఆచరించడం,
ప్రతి శుక్రవారం విధిగా నవాజ్ చేయటం వారికి రివాజు,
ముస్లిం సోదరులతో ఎప్పుడూ
మిలాఖత్ అవుదాం
మతం మన సౌభాతృత్వానికి
కాకూడదు అడ్డుగోడ
మసీదైన మందిరమైన చర్చ్ అయినా
పేరులో మార్పే
అన్నీటా ఆ సర్వాంతర్యామి ఒకరే
రామ్ రహీం రాబర్ట్ ఏక్ హై!
కొండలూ లోయలూ నదులు
అన్నీ ప్రకృతి దీవెనలే
అవి పరస్పరం ఈర్ష్య పడవు
అలానే మనం సాగించాలి మనుగడ
బక్రీద్ శుభాకాంక్షలతో....
డా విడి రాజగోపాల్
9505690690