సాహితీకిరణం సి.నా. రె
తెలుగు సాహితీ కిరణం
సిరిసిల్ల హనుమాజిపేట లో జననం
మరువ లేని తెలుగు కవనం
మూర్తీ భవించిన వదనం
తెలుగు ప్రపంచానికి సినారె ఒక శక్తి
తెలుగు హిందీ ఉర్దూభాషలలో అనూహ్యమైన అద్భుతశక్తి
పద్య గేయ వచన కవిత్వాల సంకలన శక్తి
తెలుగుదేశమందు వెలసిన సాహితీశక్తి
ప్రహ్లాదునిచరిత్ర సీతాపహరణం నాటకాలు
మనిషి చిలుక ముఖాముఖి విశ్వనాథనాయకుడు రచనలు
ఇజం నకు కట్టుబడిన సమకాలీన రచయిత
విశ్వంభర తో విశ్వాఖ్యాతి పొందిన మహోన్నతుడు
ఙ్ఞానపీట్ అవార్డ్ పొందిన రెండవ తెలుగు సాహితీ కారుడు
శబ్ద స్ఫూర్తి కలిగిన తెలుగు అభ్యుదయకారుడు
సింగిరెడ్డి నారాయణరెడ్డి ఒక అక్షర సూరీడు
సాహిత్య అకాడమీ అవార్డు సాహిత్య అకాడమీ ఫెలోషిప్
పద్మశ్రీ పద్మభూషన్ అవార్డ్స్
కళాప్రపూర్ణ బిరుదాంకితులు
ఎన్నో సినీ గేయాలును అందించిన వాడు
ఏ.పి.అధికారభాషా అద్యక్షులు గా
ఏ.పి.రాష్ట్ర సాంస్కృతిక అధ్యక్షలు
ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించిన సకల కళా నైపుణ్యుడు
రచన: పసుమర్తి నాగేశ్వరవు
సాలూరు
విజయనగరం జిల్లా