*సమాజంలో శాంతిభద్రతలు*
అసలు ఈ సమాజంలో శాంతిభద్రతలు ఎందుకుకొరవడుతున్నాయి.
.?మనుషులు ఎందుకు నేరాలకు పాల్పడుతున్నారు..?
ఎందుకు మనిషి వికృతంగా ప్రవర్తిస్తున్నాడు..?ఎందుకు ఈ హింస దౌర్జన్యాలు..?ఎందుకు ఈ నేరప్రవృత్తి..?ఎందుకు ఈ అమానుష పర్వాలు..?మనిషన్నవాడు జంతువులా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు..?సమాజంలో ఇలాంటి దుష్పరిణామాలు కల గడానికి సవాలక్ష కారణాలు ఉంటాయి.అది కుటుంబ వాతావరణం కావచ్చు,అదొక క్రమశిక్షణ రాహిత్యం,అంతకన్నా నేరప్రవృత్తి కావచ్చు, ఇంకా వ్యక్తిత్వ లోపాలు ఉండవచ్చు,కుటుంబ నేపథ్యం నేర విధమైనదీ ఉండవచ్చు, అయితే కారణాలు ఏవైనా ఉండవచ్చు కానీ సమాజంలో ఇలాంటివి జరగడం మనుషుల్లో అశాంతిని కలిగించడం కాస్త ఆలోచించే విషయమే..!??ఎందుకంటే "ఎవరిదో నెత్తి ఎవరిదో కత్తి" అన్న రీతిన..పరులు,సంబంధం లేనివాళ్ళు బాధలు అనుభవించాల్సి వస్తోంది..!? "గాలికి పోయే కంప మీదికి తెచ్చుకున్నట్లు" అనిపిస్తోంది..!? ఇలాంటి దుష్పరిణామాలకు.. "చట్టం" ఒక్కటే పరిష్కారం కాజాలదు..!? ముందు మనుషుల్లో "సంఘజీవనం" పట్ల ఒక విధమైన "శాంతియుత బోధన" కలిగించడం ఎంతైనా అవసరం. అందుకోసం సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వ్యక్తిత్వ నిపుణుల చేత కౌన్సిలింగ్ కల్పించడం ఎంతైనా అవసరం.తద్వారా సమాజాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. మనుషులను .. కోపం ఆవేశాలు వగైర భావోద్వేగాల.. నియంత్రణ ఎలానో నిపుణులు అవగాహన కల్పించడం ద్వారా ఎంతో కొంత మార్పు రావడం జరగవచ్చు. ఒక్క "శారీరక శిక్ష" ద్వారా సమాజంలో శాంతి నెలకొల్పడం అసాధ్యం. ముందు "మానసిక మార్పు" రావాలి. అలా చేయడం ద్వారా మనం ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు.సమాజంలో శాంతి భద్రత కొంతైనా సాధించవచ్చు.సమాజంలో శాంతి భద్రతలకు అందరూ తమ వంతు కృషి చేయాలని కోరుతూ..
🖊️🖋️
*విన్నర్*
*ముహమ్మద్ ముస్తఖీమ్*
కొల్లాపూర్.