'కారణ జన్ముడు' నాన
పేరు:పిల్లి.హజరత్తయ్య
ఊరు:శింగరాయకొండ, ప్రకాశం జిల్లా
9848606573
బిడ్డల బాగు కోసం మనసులో కఠినత్వాన్ని నింపుకొని లేని గాంభీర్యాన్ని ఒలికించే నాన్న మనసు నిర్మలమైనది
పిల్లలను కంటికి రెప్పలా, కళ్ళలో కొవ్వొత్తులు పెట్టుకుని కాచే నాన్న చూపులు పవిత్రమైనవి
కుటుంబ పోషణ కోసం కనులు తెరిచింది మొదలు కనులు మూసే వరకూ నిరంతరం నిస్వార్థంతో పనిచేసే నాన్న ప్రేమ అజరామరమైనది
పిల్లల సంతోషం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి పిల్లలకు భరోసాను కల్పించే నాన్న పలకరింపులు అమృతతుల్యమైనవి
పిల్లలకు నూరిపోసే ధైర్యవచనాలు,భవిష్యత్తు భరోసాను పెంచే నాన్న పలుకులు మంత్రముగ్ధమైనవి
పిల్లలు ప్రయోజకులైతే తానే విజయం సాధించినట్లు ఉప్పొంగిపోయే నాన్న హృదయము స్వచ్ఛమైనది
సృష్టికర్త దేవుడైతే సృష్టికి మూలమైన కారణజన్ముడు మాత్రము నానే