బాలకార్మికులు --పిల్లి. హజరత్తయ్య

బాలకార్మికులు --పిల్లి. హజరత్తయ్య



బాల కార్మికులు

--- పిల్లి. హజరత్తయ్య
శింగరాయకొండ, ప్రకాశం జిల్లా
____________________________

బలపం పట్టి బడికి వెళ్లాల్సిన బాల్యం 
భారమైన శ్రమకు బందీయై
బాలకార్మికులుగా మగ్గుతున్న బాలల జీవితాలు

ఒడలిన దేహం,చెదిరిన కురులు
నిస్సత్తువ ఆవహించిన చేతులు
బుగ్గి పాలవుతున్న బాల్యానికి నిదర్శనాలు

పెరుగుతున్న పనిగంటలు
పడిపోయిన శారీరక పెరుగుదలలు 
పతనమవుతున్న మానవ వనరులు 
నేడు ఎటుచూసినా కనిపిస్తున్న దృశ్యాలు

బలమైన శాసనాలు ఉన్నా 
భౌతిక వేధింపులకు, భౌతిక దాడులు తప్ప
మానవీయ విలువలు మచ్చుకైనా కానరావు

శ్రమదోపిడి జరుగును తప్ప
శ్రమకు తగిన వేతనం లభించదు
సామాజిక భద్రత వర్తించదు

చట్టాలు ఎన్ని ఉన్నా
పటిష్టంగా అమలు జరగవు
విద్య లభించదు, పునరావాసం దొరకదు

ప్రభుత్వాలు బాలల చట్టాలు సమగ్రంగా అమలుచేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలి.
బాలలే దేశ వనరులు వారి ప్రగతే దేశ ప్రగతి.

0/Post a Comment/Comments