వీర మాత
వందనమమ్మా వీరమాత
అభివందనం అమ్మ మరాఠీ దేవత
చత్రపతి శివాజీ ని కన్న మాతృమూర్తి వి నీవు
ఉగ్గుపాలతో శౌర్య ప్రతాపాలను రంగరించి పెంచిన రమణీయ రత్నా వి నీవు...
భర్త ఆదరణను పొందలేదు
బిడ్డను నువ్వు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే హిందూమత మణిదీపం గా పెంచావు నీ పంచ ప్రాణములతో...
శివాజీ పేరు వినగానే గుర్తుకు వచ్చేది నీ పేరే
తల్లి తండ్రి గురువు దైవం అన్ని నీవై పెంచావు శివాజీ ని...... వీరత్వాన్ని హిందూ తత్వాన్ని గోరుముద్ద లు గా తినిపించి... హిందూ ఔన్నత్యాన్ని పెంచావు
యుద్ధ విద్యలు గెరిల్లా విద్యలు నేర్పించి అజేయుడు గా నిలిపావు నీ బిడ్డని....
మగువ లకే మణిదీపం నీవు.
ప్రతి తల్లి కి ఆదర్శ మాతృ మూర్తివి నీవు.....జిజియాబాయి మిత్రుడుగా శివాజీ కన్న తల్లి గా చరిత్రలో చిరస్మరణీయంగా
నిలిచావు. శౌర్య మాత జిజియా బాయి పాదపద్మములకు శతకోటి ప్రణామములు... వీర మాతకు అక్షర నివాళి...
--- శ్రీమతి సత్య మొం డ్రెటి,
హైదరాబాద్.
(వచనం)