కవియే కళాత్మకశక్తి (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

కవియే కళాత్మకశక్తి (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

కవియే కళాత్మకశక్తి


కానిప్రపంచాన్ని సృష్టించేవాడు
లేని విషయాన్ని లిఖించేవాడు
ఊహాత్మక శక్తి కలవాడు
వ్యూహాత్మకత నెరిగినవాడు

సృజనాత్మకత గలవాడు
నవ్యత్వం నవకల్పనలు మేళవించేవాడు
విప్లవాత్మకమైన వర్ణణత్మకమైన
వచన పద్య కథ కథనాశక్తి గలవాడు

నాటి నన్నయ్య నుండి నేటి శ్రీశ్రీ వరకు                              నాటిత్యాగయ్యఅన్నమయ్యల నుండి 
నేటి మంగలం పల్లివరకుగొప్పకవులే

నేడు ప్రపంచానికి అందిన మహాకావ్యం రామాయణం
గోప్ప ఇతిహాసం మహాభారతం
ధర్మాన్ని ప్రభోదించే భగవద్గీత
మహాత్ముల కలాలనుండి   జాలువారిన అమృతాఫలాలే

శ్రీ శ్రీ సి.నా.రె జాషువా దాశరధి
కలం ఝుళిపించిన కవణులే
రచనల ద్వారా సమాజాన్ని మేల్కొలిపిన వారే
కత్తి కన్నా కలం గొప్పదని నిరూపించిన వారే
భావితరాలకు ఆదర్శపు అమృతపు కవనులే 

కనుకనే కవి కాదు ఒక వ్యక్తి
అనుభవ సారాంశాల అపూర్వశక్తి
రవిగాంచని చోటు కవిగాంచగల మహాయుక్తి
అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కవియే
'కలా' (కలం)త్మక శక్త

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
           విజయనగరం జిల్లా
           9441530829

 

0/Post a Comment/Comments