ముకుతాడు
--- డా.రామక కృష్ణమూర్తి,
బోయినపల్లి, సికింద్రాబాద్.
వికృత చేష్టల శాడిజాలు
విశృంఖల పరపీడన ధోరణులు
లింగ వివక్షల అహంకారాలు
సంస్కారహీన పెడపోకడలు
అమానవీయ వికృత లక్షణాలు
నేర మనస్తత్వ గుణాలు
రాక్షస మానసంలో మేల్కొనే కోరికలు
అపరిపక్వ ఆలోచనల విపరీతాలు
స్వేచ్ఛాపూరితమైన ఆగడాలు
ధనమదాంధ అకృత్యాలు
మానసిక అసంతులన అవలక్షణాలు
సినిమాల,అంతర్జాలాల
మోహమాయా పాశాలు
విచ్చలవిడిగా చేస్తున్న
విపరీత ధోరణులకు కళ్ళెం వేసేలా
చట్టాలు మారాలి
సత్వర న్యాయం అందాలి
కఠినశిక్షలు అమలుపరచాలి
సమాజ దృక్పథం మారాలి
నైతికవిలువలు పెరగాలి
స్త్రీ మాతృమూర్తి అనే భావన పెరగాలి.
హానిచేసే రాక్షసులకు
గుణపాఠాలు జరగాలి
సమాజంలో భద్రత పెరగాలి
జవాబుదారీతనం రావాలి
తక్షణ స్పందన,సత్వర దండనే
పరిష్కారం కావాలి.